నష్టాల్లోంచి లాభాల్లోకి  సూచీలు | Sakshi
Sakshi News home page

నష్టాల్లోంచి లాభాల్లోకి  సూచీలు

Published Sat, Feb 1 2020 10:55 AM

stockmarkets turn into green - Sakshi

సాక్షి,ముంబై:యూనియన్‌ బడ్జెట్‌ ప్రత్యేక ట్రేడింగ్‌ సందర్భంగా శనివారం దేశీయ మార్కెట్‌ నష్టంతో మొదలైంది అంతర్జాతీయంగానూ మార్కెట్‌కు ప్రతికూల సంకేతాలుతో అమ్మకాలు సాగినా కానీ తరువాత పుంజుకుని లాభాల్లోకి మళ్లింది. సెన్సెక్స్‌80  పాయింట్లు ఎగిసి  40859 వద్ద, నిఫ్టీ 24 పాయింట్ల లాబంతో 11985 వద్ద కొనసాగుతున్నాయి. శనివారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవుదినం అయినప్పటికీ కేంద్రం బడ్జెట్‌ ప్రవేశపెట్ట నుండంతో స్టాక్‌ ఎక్చ్సేంజీలు పని చేస్తున్నాయి.   హెచ్‌యూఎల్‌, మారుతిసుజుకి, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఏసియన్‌ పెయింట్స్‌, బజాజ్‌ ఆటో, హీరో మోటోలాభపడుతున్నాయి. 

మరోవైపు 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను  కేంద్ర ఆర్థిక నిర్మలా సీతారామన్ మరికొద్ది క్షణాల్లో  ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్‌కు అనుగుణంగా ఇన్వెస్టర్లు అప్రమత్తంగా  వ్యవహరించే అవకాశం ఉంది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement